యాంకర్‌ రవి, శ్రీముఖిల మధ్య మ్యాటర్ ఏంటి?

607
Ravi srimukhi
Ravi srimukhi
- Advertisement -

తెలుగు బుల్లితెర యాంకర్స్ రవి, శ్రీముఖి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందా? లాస్య, రవితో కలిసి షోస్ లో ఎందుకు కనిపించడంలేదు. తెరముందు, తెరవెనకా ఏం జరుగుతోంది. యాంకర్లు శ్రీముఖి, రవి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి ఇటీవల ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించడంతో పాటు కొన్ని టీవీ షోస్ లో కూడా హోస్ట్ గా చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు చెప్పిన కొన్ని విషయాలు లవ్ మ్యాటర్ ని కన్ఫమ్ చేస్తున్నాయి.

patas

తనను ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందని రవి ఇంటర్వ్యూలో చెప్పాడు. అది కూడా శ్రీముఖి గురించే. వెంటనే శ్రీముఖి ఇన్వాల్స్ ఇయ్యి అలా ప్రపోజ్ చేసింది తానే అంటూ చెప్పేసింది. అయితే ఇది సీరియస్ ప్రపోజ్ కాదన్నారు ఇద్దరు. కానీ, ఇంకా ఏదో ఉందని మాత్రం ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. గతంలో రవి, లాస్య పై కూడా ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు వచ్చాయి.

VJ-Ravi-VJ-Lasya-Photo-Stills-2అయితే రీసెంట్ గా లాస్య బుల్లితెరపై కనిపించడమే లేదు. రవితో లాస్య స్టేజ్ పై కనిపించి చాలా కాలమైంది. దీంతో ఆమెపై పుకార్లు మరీ ఎక్కువయ్యాయి.లాస్య ఆరోగ్యంగా లేదని, యాంకర్ రవి వల్లనే లాస్య మీడియాకు దూరమయ్యిందంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అయితే రీసెంట్ గా ఈ పుకార్లన్నింటిపై లాస్య స్పందించింది. తాను ఆరోగ్యంగానే వున్నానని, త్వరలోనే ఓ మంచి షో ద్వారా మీ ముందుకు రాబోతున్నానని తెలిపింది. తనపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, వాటిలో ఎలాంటి నిజం లేదని చెప్పింది. అయితే రవి, లాస్య కలిసి ఒక షో చేస్తే తప్పా.. ఈ గాసిప్స్ కు చెక్ పడే అవకాశంలేదు. ఇక శ్రీముఖి, రవి మ్యాటర్ ఏంటో తేలాల్సి ఉంది.

 

Courtesy – YOYO TV

- Advertisement -