మహిళల వన్డేల్లో మిథాలీ ప్రపంచ రికార్డ్..

235
Mithali Raj breaks the record for most appearances in women’s ODIs
- Advertisement -

భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మహిళల క్రికెట్‎లో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్‎గా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు 191 వన్డేలు ఆడి నంబర్-1 స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్‎ని వెనక్కి నెట్టి మిథాలి ప్రథమ స్థానాన్ని చేరుకుంది. ఇంగ్లాడ్‎తో 192వ వన్డేతో రికార్డు బ్రేక్ చేసింది.

1999 జూన్‎లో ఐర్లాండ్‎తో తొలి మ్యాచ్‎తో వన్డేలోకి మిథాలి అర్రంగేట్రం చేసింది. వన్డేల్లో 6 వేలకు పైగా పరుగులు చేసి భారత ప్లేయర్‎గా కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు 10 టెస్టులు, 72 టీ20ల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. అత్యధిక వన్టేలు ఆడిన మహిళా క్రికెటర్ జాబితాలో టీమిండియా స్టార్ పేసర్ జులన్ గోస్వామి 167 మ్యాచ్‎లతో మూడో స్థానంలో కొనసాగుతుంది.

మిథాలీ‎రాజ్ తన ఆట తీరుతో భారత్ మహిళల క్రికెట్‎కు కొత్త ట్రెండ్‎ను తీసుకొచ్చింది. ఎందరో విమర్శుకుల ప్రశంసలను పొందింది, భారత మహిళల క్రికెట్‎‎కు ఎన్నో విజయాలను అందించిన ఘనత మిథాలీరాజ్‎దీ. ఆమె మరిన్నీ విజయాలు అందించాలని, ఇంకా ఎన్నో రికార్డులు బ్రేక్ చేయాలని కోరుకుందా.

- Advertisement -