పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో పలుచోట్ల చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
రాష్ట్రానికి భారీ వర్ణసూచన ఉన్న నేపధ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్ఫి ప్రదీప్ చంద్రతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ರೌಷ್ಟು వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేయాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. జిహెచ్ఎంసి కమీషనర్ జనార్థన్ రెడ్డి, నగర పోలీస్ కమీషనర్ మహీందర్ రెడ్డిలతో సిఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లాల్లో, హైదరాబాద్ లో అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని స్పందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ (O40-23454088) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లా ఎస్పీలతో కలిసి డిస్టిక్ట్ డిజాస్టర్ మేనేజ్ మొంట్ అధారిటీ సమావేశం వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. వర్ణాల వల్ల ఇబ్బంది కలిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సదరు కేంద్రాల్లో మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పారిశుద్య నిర్వహణ బాగుండేలా చూసుకోవాలని చెప్పారు. అంబులెన్సులను, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకుని అత్యవసర సేవలు అందించాలని వైద్య, ఆరోగ్య సూచించారు. అవసరమైన పక్షంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సేవలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. విద్యుత్ పార్ట్ సర్యూట్ లు సంభవించకుండా డిస్కమ్ లు జాగ్రత్త వహించాలన్నారు. రైల్వే లైన్లు, లో లెవెల్ కాజ్ పేలు, బ్రిడ్డిల వద్ద ఎప్పటికప్పుడు నీటి ప్రవాహ స్థాయిని అంచనావేస్తూ అవసరమైన రీతిలో స్పందించాలని సూచించారు. చెరువు కట్టల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని నీటి పారుదలశాఖను, గ్రామ స్థాయలో ఉండే విఆర్ఎలు, విఎవోలను ఆదేశించారు.