బీజేపీ ఎంపీ అరవింద్ మా ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్ లపై అసత్య ఆరోపణలు చేశారు…వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావు.టీఆర్ఎస్ నేతలపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు.
వ్యక్తి గతంగా విమర్శలు చేస్తే సహించేది లేదు..ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలన్నారు కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి.బీజేపీ ఎంపీ అరవింద్ టీఆరెస్ పార్టీ ని…సీఎం కేసీఆర్ ని విమర్శించే నైతిక హక్కు లేదననారు నాగుర్ల వెంకన్న.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అరవింద్ అనడం సిగ్గు చేటు.ఎన్నికల్లో ఇవ్వని హామీలను అమలు చేసిన ఘనత టీఆరెస్ పార్టీది…సీఎం కేసీఆర్ ది.తెలంగాణ లో అమలు అవుతున్న పథకాలను పీఎం మోడీ, కేంద్ర మంత్రులు అభినందనిచ్చారు.
భూముల కబ్జా చరిత్ర బీజేపీ నాయకులదే.బీజేపీ పార్టీ కార్యాలయం కోసం ఇచ్చిన భూములను కబ్జా చేసిన ఘనత ఆ పార్టీ నాయకులదే అన్నారు వికలాంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వాసుదేవారెడ్డి.మా ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్ ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎంపీ అరవింద్ కు లేదన్నారు.