బిగ్‌ బితో శివగామి..న్యూస్ వైరల్

712
ramyakrishna amithab

విలక్షణమైన నటనతో భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అమితాబ్ బచ్చన్. ఓ వైపు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న బిగ్ బి దక్షిణాదిలో తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరాలో నటిస్తుండగా తొలిసారిగా తమిళంలో అడుగుపెడుతున్నారు. ‘ఉయర్నత మణిదాన్’ సినిమాలో కీరోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమిళవాణన్ దర్శకత్వం వహిస్తుండగా సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

అమితాబ్ సరసన బాహుబలితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రమ్యకృష్ణ(శివగామి) నటించనున్నట్లు తెలుస్తోంది. కథాపరంగా ఈ పాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉండటంతో రమ్యకృష్ణను ఎంపిక చేసినట్టుగా సమాచారం.

ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా దర్శకుడు ఎస్.జె. సూర్య ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా బిగ్‌ బితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన సూర్య నా జీవితంలోనే సంతోషకరమైన సందర్భం. ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్‌తో సినిమా చేయాలన్న కల నెరవేర్చిన దేవుడికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఈ విషయాన్ని రజనీకాంత్ సర్, ఏఆర్ మురుగదాస్‌లతో షేర్ చేసుకుంటున్నా అని ట్వీట్ చేశాడు. తమిళంతో పాటు హిందీలో ఈ సినిమా విడుదల చేయనున్నారు.