బాబు కోసం చిరు..

218
- Advertisement -

సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన నటులు చాలా అరుదు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి,మోహన్ బాబు ప్రత్యేకం. విలక్షణ పాత్రలతో మెప్పించి తామెంటో నిరూపించుకున్నారు. పైగా వీళ్ళిద్దరూ మొదటినుంచీ మాంచి స్నేహితులే. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు స్వర్గం-నరకం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మోహన్ బాబు నటుడిగా 40 వసంతాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ‘లలిత కళా పరిషత్’ వారు మోహన్ బాబుని ‘నవరస నట తిలకం’ అనే పురస్కారంతో సత్కరించనున్నారు.

మరోవైపు రాజకీయాల నుంచి ఇంచుమించు విశ్రాంతి తీసుకుని సినిమాలపై మెగాస్టార్ చిరంజీవి దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటిస్తున్న చిరు.. షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ మోహన్ బాబు కోసం తీరిక చేసుకొని ఈ కార్యక్రమానికి హాజరవుతానని చిరు చెప్పారు. వీరిద్దరి మధ్య ఎన్ని విబేధాలు వచ్చాయన్నా, ఎన్ని వివాదాలు ఉన్నా అవన్నీ వీరిమధ్య గల సాన్నిహిత్యంలోని ఒక భాగమే అని తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయసుధ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

hiranjeevi-Mohan-Babu

టాలీవుడ్ పండ‌గ వజ్రోత్సవాల వేళ చిరుపై మోహన్ బాబు ఫైర్ పెద్ద చిచ్చు రేపింది. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన నటనలోనే కాదు, తన ప్రవర్తన విషయంలో కూడా చాలా విలక్షణంగా ఉంటాడు. అటువంటి మోహన్ బాబు ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు చిరంజీవికి మధ్య ఉన్న స్నేహబంధం సీక్రెట్ చెప్పాడు.

chiru

తానూ చిరంజీవి పరిశ్రమలో మంచి స్నేహితులమని అయితే తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా కొంతమంది థర్డ్ గ్రేడ్ ఫెలోస్ తనకు చిరంజీవి మధ్య ఉన్న స్నేహ బంధం చూసి తట్టుకోలేక తమ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారు. తర్వాత చాలా సందర్భాల్లో కూడా చిరు,మోహన్ బాబు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు.

- Advertisement -