ప్రాణనష్టంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

385

నగరంలో కురిసిన వర్గాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్గాల వల్ల ప్రాణనష్టం సంభవించడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. నగరంలో ఇప్పటికే అసాధారణ వర్ధాలు కురవడంతో పాటు, ఇంకా వర్ణ సూచన ఉన్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. భారీ వర్ణాల నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిహెచ్ఎంసి కమీషనర్ జనార్థన్ రెడ్డి, సిటి పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిలతో మాట్లాడారు.

వర్షాల వల్ల నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాని ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ స్తంభించి పోయిందని ముఖ్యమంత్రి అన్నారు. బస్తీల్లోకి నీరు రావడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారిని మరోచోటికి తరలించాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కెటిఆర్ ను, అధికారులను ఆదేశించారు. ట్రాపిక్ ను క్రమబద్దీకరించడంతో పాటు, ఇతర సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా నగర పోలీస్ కమీషనర్ ను సిఎం ఆదేశించారు. జిహెచ్ఎంసి లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (21111111) కు అన్ని ఎప్పటికప్పుడు సమూూరం అందించాలని, దానిని బట్టి అదికార యంత్రాంగం వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. నగరంలో విద్యుత్, రహదారులు, డ్రైనేజి, మ్యాన్ హోల్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. నగర నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు బారీగా నీరు వచ్చి చేరుతున్నదని, అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.