దెబ్బలు తిన్నా.. తగ్గని బుడ్డోడు

616
NTR on 'Janatha Garage' and why he dislikes the star system
NTR on 'Janatha Garage' and why he dislikes the star system
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని రేపు థియేటర్ల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రక్కన కొరటాల శివ, మరో ప్రక్క ఎన్టీఆర్ మీడియాకు ఇంటర్వూలు ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు.

చాలా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి సూపర్‌ స్టార్‌డమ్‌ అందుకున్న నటుడు జూనియర్‌ ఎన్టీయార్‌. 20 ఏళ్ల వయసులోనే ‘ఆది’, ‘సింహాద్రి’ వంటి సినిమాలతో స్టార్‌హీరో అయిపోయాడు. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. వరుస విజయాల తర్వాత తన పరిస్థితి గురించి ఎన్టీయార్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘17 ఏళ్ల వయసులో నేను ఇండస్ట్రీలోకి ప్రవేశించాను. 20 ఏళ్లకు ‘సింహాద్రి’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను చూశా. అంత చిన్న వయసులో ఆ విజయాలను సరిగ్గా హ్యాండిల్‌ చేయలేకపోయా. ఆ సమయంలో దేవుడు, సమాజం నాకు మొట్టికాయలు వేశారు. అప్పుడు అర్థం చేసుకున్నా. అప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఇప్పుడు వివరణ ఇచ్చుకోలేన’ని ఆయన చెప్పారు.

మామూలుగా అయితే సినీ పరిశ్రమలో ఎవరూ ‘ఫ్లాపుల్ని’ ఒప్పుకోరు. ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ‘అంచనాల్ని అందుకోలేకపోయాం..’ అనే మాటనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఫ్లాపులొచ్చాయి.. అనడానికి బదులు. కానీ, ఏకంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, కెరీర్‌లో తగిలిన దెబ్బలతోనే తాను చాలా మారానని చెబుతున్నాడు. నిజానికి, ‘ఆంధ్రావాలా’ సినిమా డిజాస్టర్‌ అయినా, దాన్ని ఫ్లాప్‌గా ఒప్పుకోలేదు ఎన్టీఆర్‌ ఒకప్పుడు. ‘నా అల్లుడు’ లాంటి సినిమాలొచ్చినా ఎన్టీఆర్‌ మారలేదు.

కానీ, ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మాటల్లో మార్పు చాలా స్పష్టంగా కన్పిస్తోంది. దెబ్బలు తగిలాయి.. మారాను.. అంటున్నాడు. అయితే అందులో అర్థం చాలానే వుంది. నిజానికి ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్‌ చవిచూసిన ఫ్లాపులు తక్కువే. కొన్ని సినిమాలు అంచనాల్ని అందుకోలేకపోయాయి.. కొన్ని యావరేజ్‌, కొన్ని ఎబౌ యావరేజ్‌.. కొన్ని ఓ మోస్తరు హిట్స్‌. మరిప్పుడు, ఆ పాత ‘దెబ్బల గురించి’ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎందుకు మాట్లాడుతున్నట్లు.?

ఒక పర్టిక్యులర్ సంఘటనతో మార్పు వచ్చేస్తుందని నేను భావించను. అది కొంత టైమ్ పీరియడ్ లో వచ్చేది. నాకైతే మార్పు నా కెరీర్ లో కొన్ని దెబ్బలు తిన్న తర్వాత వచ్చింది. నాన్నకు ప్రేమతో ముందు చేసిన కొన్ని సినిమాలు నాకు అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు. నటుడుగానూ, భాక్సాఫీస్ వద్ద కూడా తృప్తి కలిగించలేకపోయాయి.

అలాగే నటులు అనేవాళ్లు నెంబర్ గేమ్ లో కి వెళ్లకూడదని నా అభిప్రాయం. ఎండ్ ఆఫ్ ది డే..భాక్సాఫీస్ రిజల్ట్ హిట్ లేక ఫ్లాఫ్ అనేది ప్రక్కన పెడితే నాకు చేసిన సినిమా ఆనందం కలిగించగలగాలి. నేను నా ఆనందాన్ని వెతుక్కోవటం మొదలెట్టాను. అది నా సినిమా లో ఖచ్చితంగా మీకు కనపడుతుంది అంటూ ఎన్టీఆర్ చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పారు.

తన ముద్దుల కుమారుడు అభయ్‌రామ్‌ అల్లరి చేసినప్పుడు మందలిస్తే.. తిరిగి గట్టిగా కొడుతున్నాడని హీరో ఎన్టీఆర్‌ అన్నారు. అలాగే మరిన్నో విషయాలు సినిమా గురించి మాట్లాడారు. ఆయన మాటల్లో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. అలాగే అభిమానులు సైతం ఈ సినిమా విజయం పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -