సమ్మెతో స్తంభించిన రవాణా..

566
Buses strike
- Advertisement -

దేశ‌వ్యాప్తంగా ఇవాళ సార్వ‌త్రిక స‌మ్మె జ‌రుగుతోంది.సుమారు 15 కోట్ల మంది కార్మికులు స‌మ్మెలో పాల్గొంటున్నారు. మొత్తం 10 కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో రైళ్లు, బ‌స్సులు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. కార్మిక వ్య‌తిరేక విధానాల‌ను వ్య‌తిరేకిస్తూ ధ‌ర్నా నిర్వ‌హిస్తున్నారు. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు బంద్‌ను పాటిస్తున్నారు. ధరలు తగ్గించాలని, కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

123

కార్మిక చ‌ట్టాల‌ను మార్చాలంటూ ఇచ్చిన బంద్ పిలుపుకు తెలంగాణ బ్యాంక్‌ల కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. కార్మిక సంఘాల‌తో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న బ్యాంక్ ప్ర‌ధాన కార్యాల‌యాల వ‌ద్ద నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీ బీఎస్ రాంబాబు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తెరిచి ఉన్నా, వాటిల్లో లావాదేవీలు జ‌ర‌గ‌వ‌ని ఆయ‌న చెప్పారు. అయితే ఏటీఎమ్‌లు మాత్రం య‌ధావిధిగా ప‌నిచేయ‌నున్నాయి.

bank-employees-strike

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95 డిపోల్లో 10వేల బస్సులు నిలిచిపోయాయి. సార్వత్రిక సమ్మె కారణంగా ఆర్టీసీ సిటీబస్సులు ఆగిపోవడంతో ప్రజలు సెట్విన్ బస్సులు, షేర్ ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిని అవకాశంగా తీసుకుని రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఇక షేర్ ఆటోలు, మామూలు ఆటోల్లో ప్రయాణించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
కార్మికుల డిమాండ్లు ఇలా ఉన్నాయి..
కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలి.
ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రాథమిక కార్మిక చట్టాలు అమలు చేయాలి. కార్మిక చట్టాల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాలి.
కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలి.
మొత్తం శ్రామిక జనాభాకు రూ. 3.000లకు తక్కువ లేకుండా పెన్షన్ హామీ ఇవ్వాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల అమ్మకాలు ఆపాలి.
పర్మినెంట్ పోస్టుల ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికనే భర్తీ చేయాలి.
ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగుల వలే వేతనం మరియు ప్రయోజనాలు కల్పించాలి.
బోనస్, ప్రావిడంట్ ఫండ్ ఇచ్చేందుకు చెల్లింపులు, అర్హతలు తొలగించాలి. బోనస్ పెంచాలి.
దరఖాస్తు చేసిన 45 రోజుల్లోనే కార్మిక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి.
తక్షణమే ఇండియన్ లేబర్ ఆర్గనేజేషన్ (ఐఎల్ ఒ) కన్వెన్షన్ సి87 మరియు సి98 లను ఆమోదించాలి.
రైల్వే, ఇన్సూరెన్స్, డిఫెన్స్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్ డిఐ)లను వ్యతిరేకించాలి.

- Advertisement -