పాపం! సురేష్ ప్రభు…

522
Poor Suresh Prabhu.
Poor Suresh Prabhu.

కృష్ణ పుష్కరాల సంధర్బంగా విజయవాడకు వచ్చిన రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు వింత అనుభవం ఎదురైంది. పుష్కరాల ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఎసీ సిఎం చంద్ర బాబు నాయుడు, ఒలింపిక్స్ రజత విజేత పివి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్‌లు పాల్గోన్నారు. ఈ ఫోటోలో నలుగురు తెలుగు వ్యక్తులు ఒకే దగ్గర కూర్చొని పుష్కరాల ముగింపు కార్యక్రమాలను ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు.

NAidu

అయితే ఇదంతా గమనిస్తున్న మన రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాత్రం ఏం మాట్లడలేకపోయాడట. అందుకు కారణం. వారంతా తెలుగులో మాట్లాడుకోవడం.. ఆయనకు తెలుగు అర్థం కాకపోవడమే. నలుగురు తెలుగు వాళ్ల మధ్యలో తెలుగు రాని వాళ్లు కూర్చుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని, పాపం! సురేష్ ప్రభు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ఫోటోపై కామెంట్లు చేస్తున్నారు.