నిత్యా మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ‘బార్ బార్ దేఖో’ చిత్రంలో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించారు. ‘బార్ బార్ దేఖో’కు పబ్లిసిటీ కల్పించుకునేందుకు ఏకంగా ఎయిర్ పోర్ట్ లో ఈ ఇద్దరు పిచ్చివేషాలు వేశాలతో ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి చుక్కలు చూపించారు. ముంబై వెళ్లడానికి వారిద్దరికీ బోర్డింగ్ పాస్ జారీ చేసినా విమానంలో ఎక్కకుండా జాప్యం చేశారు.
సోమవారం ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లే ఎయిరిండియా విమానం (ఏఐ 317) టికెట్లు కొని ఎయిర్ పోర్టులోకి ప్రవేశించారు కత్రినా, సిద్ధార్థ. ఆ టికెట్లను చూపించి టీ3 ప్రధాన టెర్మినల్ లోకి ప్రవేశించిన ఈ జంట.. ఏకంగా డ్యూటీ ఫ్రీ ఏరియాలోకి వెళ్లి ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొన్ని డ్యాన్సులు, డైలాగులు చెప్పారు.ఈ నేపథ్యంలో విమాన బయలుదేరడం ఆలస్యమైందని పలువురు ప్రయాణికులు గొడవ చేయడంతో కత్రినా, సిద్దార్థ్ ఎక్కకుండానే అధికారులు ఆ విమానాన్ని పంపించారు.
కత్రినా, సిద్దార్థ్ ల తీరుపై సీఐఎస్ ఎఫ్ అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కేవలం సినిమా ప్రమోట్ చేసుకోవడానికే వచ్చినట్టు కనిపించిందని, అందుకే తెగించి మరీ డ్యూటీ ఫ్రీ ఏరియాలోకి వెళ్లారని ఆ అధికారి తప్పుబట్టారు. మరోవైపు విమానం బయలుదేరడానికిముందే టీ3 టెర్మినల్ నుంచి బయటకు వచ్చేందుకు కత్రినా, సిద్ధార్థ ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎయిర్ లైన్ ప్రోసిజర్ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుమతించారు.
https://www.youtube.com/watch?feature=player_embedded&v=fap1_kHw0gM