నా కల నెరవేరింది : సింధు

655
sindhu...._
sindhu...._
- Advertisement -

ఒలింపిక్స్‌ లో పతకం సాధించాలన్నది తన కల అని.. ఈ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు తెలిపింది. సోమవారం నగరానికి చేరుకున్న సింధుకు ఘన స్వాగతం లభించింది. గోపీచంద్ అకాడమీలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ఇంతటి ఘన స్వాగతం లభిస్తుందని తాను అనుకోలేదని తెలిపింది. తల్లిదండ్రులు తనకోసం చాలా కష్టపడ్డారని ఆమె పేర్కొంది. వారికి ఏమిచ్చినా తక్కువేనని సింధు తెలిపింది.

రజత పతకంతో స్వదేశానికి చేరుకున్న తనను ప్రభుత్వం ఘనంగా సత్కరించడం ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంది. ఫైనల్‌ మ్యాచ్‌ ముగియగానే ప్రత్యర్థి మారిన్‌ను తాను అభినందించినట్లు సింధు తెలిపింది. ఒలింపిక్స్‌ కోసం తాను, కోచ్‌ గోపీచంద్‌ రెండు నెలల ముందు నుంచే కష్టపడినట్లు వెల్లడించింది. మహిళలు క్రీడల్లో రాణించాలంటే తల్లిదండ్రుల చాలా అవసరమని పేర్కొంది. ప్రభుత్వం చాలా ఘనంగా సన్మానించింది.. ధన్యవాదాలు. అకాడమీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఒలింపిక్స్‌ లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలని అనుకున్నా. కోచ్ గోపీచంద్ మద్దతు వల్ల ఇదంతా సాధ్యమైంది. క్రీడల్లో మహిళలకు తల్లిదండ్రుల మద్దతు చాలా అవసరం’ అని తెలిపారు.

సింధు ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆమె కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తెలిపారు. సింధును తెల్లవారుజామునే అకాడమీకి తీసుకొచ్చేందుకు ఆమె తండ్రి రమణ రెండు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టారని తెలిపారు. సింధు అకాడమీకి చెప్పిన సమయానికి వచ్చి కష్టపడిందని.. ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -