త్వరలో బస్సు యాత్ర

176

త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇవాళ మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్టులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆశేష ప్రజానికాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంటే, రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపించడానికి తాము నిరంతరం పనిచేస్తూ పక్క రాష్ట్రాలతో సఖ్యతతో మెలుగుతూ రాష్ట్ర కలలను నిజం చేస్తుంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  త్వరలోనే రాష్ట్రంలో బస్సు యాత్ర చేపడతానని, కాంగ్రెస్‌ నాయకుల బండారం బయట పెడతానని సీఎం కేసీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలను నిరూపించాలని లేదంటే కేసులు పెడతాం జాగ్రత్త అంటూ సీఎం కేసీఆర్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు.