కోటి ఎకరాలకు నీళ్లు తథ్యం

215
KCR bus yaatra soon
KCR bus yaatra soon
- Advertisement -

రాష్ట్రానికి జ‌ల‌సిరులు తీసుకొచ్చిన జ‌న‌నేత‌కు ప్ర‌జ‌లు ఘ‌న నీరాజ‌నాలు పలుకుతున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన అప‌ర భగీర‌థుడికి టీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో సీఎంకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో రెండు వేల మంది కళాకారులు సీఎంను స్వాగతించారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ  కాళేశ్వరం నీళ్లతో ఉత్తర తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతానని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రతో గోదారి నీటిపై ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన సీఎం ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రం నలుమూల నుండి భారీగా తరలి వచ్చిన గులాబీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, రైతులు సీఎం కేసీఆర్‌కు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఎన్నో అవంతరాలు, అడ్డంకులను దాటుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతోందని అన్నారు.  ఏడాది కాలంగా మహారాష్ట్రతో సఖ్యత, సత్‌ సంబంధాలను ఏర్పరచుకొని, ఓపికతో మహారాష్ట్ర  ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని చేసుకున్నామని, ఈ ఒప్పందం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగుతుందని  సీఎం కేసీఆర్‌ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో అభివృద్ధి బాటలో పయనిస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకులు అడ్డంకులు సృష్టిస్తూ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఒప్పందంలో 152 మీటర్ల ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డిలు అవాకులు చెవాకులు పేలుతున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దమ్ముంటే  ఒప్పంద పత్రాన్ని తీసుకుని బేగం పేట ఎయిర్‌ పోర్టుకు వచ్చి నిరూపించాలని, ఉత్తమ్‌ కుమార్‌ చెప్పిందే  నిజమైతే తాను ఇంటికి పోనని, నేరుగా రాజ్‌ భవన్‌ కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు.

తెలంగాణ పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ కళ్లలో నిప్పులు పోసుకుంటుందని, జనాల్లో ఇంత సంతోషం కనపడుతుంటే కాంగ్రెస్‌ సన్నాసులకు నల్లజెండాలు కనపడుతున్నాయని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణకు నీళ్లు రాకుండా వైఎస్‌ చంద్రబాబులు కుట్ర చేస్తుంటే కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు ఏనాడు స్పందించలేదని, తెలంగాణ కాంగ్రెస్‌ ,టీడీపీ నాయకులు పదవుల కోసం పాకులాడిండ్రని, తెలంగాణను సర్వనాశనం చేసిన నాయకులే కాంగ్రెస్‌, టీడీపీ నాయకులని సీఎం కేసీఆర్‌ అన్నారు.

 

- Advertisement -