ఏ చిన్న పాత్ర దొరికినా తాను తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. తాను నటించిన ‘పింక్’ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆయన ఓ తెలుగు ప్రైవేటు ఛానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా దక్షిణాది సిమాల్లో ఏలాంటి రోల్ అయినా, చివరికి బ్యాక్ డ్రాప్ లో కనిపించే పాత్రలో అయిన నటించడానికి తాను రెడీ అన్నారు.
తనకు పాత్రలు ఇవ్వండి అని ఆయన దక్షిణాది దర్శకులను కోరారు. తనకు ఇక్కడ ఎంతోమంది స్నేహితులున్నారని చెప్పిన బిగ్ బీ… హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని అన్నారు. కరెంటు కోతలుండవని తాను మీడియాలో చదివానని పేర్కొన్నారు. మహిళలను కూడా పురుషులతో సమానంగా చూడాలని ఆయన కోరారు. తన ఆస్తిలోనూ తనయుడితో సమానంగా తన కూతురుకి వాటా ఇస్తానని వెల్లడించారు. పింక్ విషయానికి వస్తే ..తెలుగు తార తాప్సి ఈ చిత్రం లో ప్రధాన పాత్రలో నటించింది.
మరోవైపు బాహుబలి-2 కోసం తాను ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్లు చెప్పిన అమితాబ్ బచ్చన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించారు.