టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా..

23
Manickam Tagore

కాంగ్రెస్ నేత జానారెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ వాయిదా వేశారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షులు యధాతధంగా కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మణికం ఠాకూర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైనదని తెలిపారు. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది.. తుది నిర్ణయం తీసుకోలేదు. సాగర్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నైతిక బలాన్ని చేకూర్చుతాయన్నారు.సాగర్ ఎన్నికల తరువాత 2023 ఎన్నికల కోసం పూర్తి కమిటీ ఎంపిక చేసి ముందుకు వెళతామని మణికం ఠాకూర్ పేర్కొన్నారు.