టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌..

108
RR vs DC

షార్జాలో జరుగుతున్న ఐపీఎల్‌-2020లో భాగంగా శుక్రవారం రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడుతున్నాయి. తిరుగులేని విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఢిల్లీ..హ్యాట్రిక్‌ ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాజస్థాన్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టులో మార్పులు చేసింది. ఆండ్రూ టైను జట్టులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది.

రాజస్థాన్‌ జట్టు: యశస్వీ జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌, సంజు శాంసన్‌, మహిపాల్‌ లోమ్రర్‌, రాహుల్‌ తెవాతియా, జోఫ్రా ఆర్చర్‌, ఆండ్రూ టై, శ్రేయస్‌ గోపాల్‌, కార్తీక్‌ త్యాగి, వరుణ్ ఆరోన్‌

దిల్లీ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, మార్కస్‌ స్టాయినిస్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, కాగిసో రబాడ, ఆన్రిచ్‌ నార్జె