టాలీవుడ్ లో లీకుల పరేషాన్?

635
Gauthamiputra-Satakarni
Gauthamiputra-Satakarni
- Advertisement -

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని లీకేలు పట్టిపీడిస్తున్నాయి. సినిమా, లేదంటే అందులోని సీన్లు, షూటింగ్ దశలో స్టిల్స్ .. ఇలా చెప్పుకుంటూపోతే లీకు వీరుల కారణంగా సినిమా విడదలకు ముందే బలి అవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణికి ఇప్పుడు ఇలాంటి సమస్యే వచ్చింది.

Gauthamiputra-Satakarni

ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకో స్టిల్ నెట్టింట్లోకి రిలీజ్ అవుతోంది.ఆ మధ్య సినిమాలో బాలయ్య బాబుకు తల్లిగా నటిస్తున్న హేమమాలిని, హీరోయిన్ శ్రియలకు సంబంధించిన చిత్రాలు నెట్‌లో హల్‌చల్ చేశాయి. ఆ తర్వాత శ్రియ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు.అంతకుముందు వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య రాజకోటలోకి శాతకర్ణి వస్తున్నట్టుండే ఫొటోలూ నెట్‌లో లీకయ్యాయి.

Gauthamiputra-Satakarni

ఇక, బాలయ్యతో పాటల షూటింగ్‌లో పాల్గొన్న శ్రియ.. వాటికి సంబంధించిన ఫొటోలనూ నెట్‌లో పెట్టేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్ ఈ సినిమా స్టిల్స్ హల్ చల్ చేస్తున్నాయి. దీంతో బాలయ్య చాలా గుర్రుగా ఉన్నాడని ఫిల్మ్ వర్గాల టాక్. షూటింగ్ స్పాట్ నుంచి ఫొటోలు ఎలా లీకవుతున్నాయంటూ చిత్రయూనిట్ పై ఆయన అసహనం వ్యక్తం చేశాడట.

Gauthamiputra-Satakarni

ఇలా షూటింగ్ స్టిల్స్ బయటకురావడం వలన సినిమా హైప్ దెబ్బతింటుందని బాలయ్యబాబు యూనిట్ కు గట్టివార్నింగే ఇచ్చాడట. మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని డైరెక్టర్ క్రిష్ తో పాటు చిత్రయూనిట్ ను శాతకర్ణి.. గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=h6dtppeHgsw

- Advertisement -