టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న అల్లు అర్జున్ గారాల పట్టి..

32
Arha

అల్లు వారి ఫ్యామిలీ నుండి మరో యాక్టర్‌ రాబోతున్నారు. అది ఎవరా అని అలోచిస్తున్నారా.. మరెవరో కాదు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ. ఈ చిన్నారి గురుంచి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో, చేష్టలతో అప్పుడే కావాల్సినంత పాపులారిటీ తెచ్చుకుంది. అర్హ త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుందని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్హ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతుందనే వార్త వినపడుతోంది. దిల్ రాజు తన బ్యానర్ పై సురేష్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందంట. దీనిపై అధికారికి సమాచారం విడుదలకావాల్సి ఉంది.