జయప్రకాశ్ రెడ్డి మృతిపై విజయశాంతి ట్వీట్..

90
Vijayasanthi

టాలీవుడ్ సీనియర్ నటుడు జయ ప్రకాష్ రెడ్డి మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగపోయింది. ఇండస్ట్రీలో ఆప్తుడిగా మెలిగిన ఆ యన మరణం అందరినీ కలచి వేస్తోంది. ప్రతి ఒక్కరూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణంపై ప్రముఖ నటి విజయశాంతి స్పందించారు. టాలీవుడ్ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయిందని తెలిపారు.

రంగస్థలం మీద, వెండితెర పైన తనదైన ప్రత్యేకశైలిలో నటన, వాచకం, విభిన్నమైన పాత్రలతో ఎందరో అభిమానులను జయప్రకాశ్ రెడ్డి మెప్పించారని కొనియాడారు. జయప్రకాశ్ రెడ్డి తమ స్వంత నిర్మాణ సంస్థలోనూ 3 సినిమాలు చేశారని విజయశాంతి వెల్లడించారు.

జయప్రకాశ్ రెడ్డితో చివరిగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించానని, వారి విలక్షణ నటన చిరకాలం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని విజయశాంతి ట్వీట్ చేశారు.