జగన్‌కు కోర్టు సమన్లు..

222
- Advertisement -

వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. రాంకీపై ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేయడంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈ మేరకు సమన్లు జారీ చేసింది. రాంకీ కేసులో మనీలాండరింగ్ కు పాల్పడినట్టు సీబీఐ ఛార్జీషీట్ లో ఆరోపించింది. దీంతో జగన్, అయోధ్యరామిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిలకు ఈడీ కోర్టు సమన్లు పంపింది. ఈనెల 23న కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం వారిని ఆదేశించింది.

- Advertisement -