చిరు ఫ్యాన్స్‌కి వర్మ సారి..

191

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వర్మ….సోషల్ మీడియా ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. తరచుగా చిరు,పవన్,రాజకీయ నాయకులపై విమర్శలు గుప్పించే వర్మ..ఈ సారి కాస్త వెరైటీగా చిరుని పొగడ్తలతో ముంచెత్తాడు. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీనెం.150’ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అంటున్నారు. సోమవారం చిరు పుట్టినరోజు సందర్భంగా ‘ఖైదీ నెం.150’ ఫస్ట్‌లుక్‌ విడుదలైన విషయం తెలిసిందే.

gopal-story_647_080215063224 Khaidi-No-150-Chiranjeevi-150th-Movie-First-Look-Poster-Out

మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ ‘మెగాస్టార్ లుక్ అమేజింగ్, ఈ లుక్ చూస్తుంటే సినిమా గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అనిపిస్తోంది. ఇది మెగాస్టార్ కెరీర్ లోనే బెస్ట్ లుక్. ఖైదీ నంబర్ 150 సూపర్ క్లాసీ, సూపర్ ఇంటెన్స్ లుక్. ఫస్ట్‌లుక్‌ చూశాక గతంలో నేను చిరు 150 చిత్రంపై చేసిన వ్యాఖ్యలు తప్పని తెలిసింది. అందుకు చిరు అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా’’ అని వర్మ ట్వీట్‌ చేశాడు.

varma