‘చావు క‌బురు చ‌ల్ల‌గా’.. లావ‌ణ్య‌త్రిపాఠి బ‌ర్త్ డే పోస్ట‌ర్..

49
Lavanya Tripathi

ఈ రోజు టాలీవుడ్‌ బ్యూటీ లావ‌ణ్య‌త్రిపాఠి పుట్టిన‌రోజు. ఈ అమ్మడు ప్రస్తుతం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ అనే కొత్త చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా న‌టిస్తోండ‌గా..లావ‌ణ్య బ‌స్తీ యువ‌తిగా న‌టిస్తోంది. ఈ మూవీ నుండి తాజాగా లావ‌ణ్య‌కు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. గులాబి రంగు చుడిదార్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ఛాయ్ గ్లాస్ ప‌ట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తోన్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది.

ప్రేమ కథగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి డైరెక్ట్ చేస్తుండ‌గా..బ‌న్నీవాసు నిర్మిస్తున్నాడు. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకొస్తుంద‌నేది తెలియాల్సి ఉంది. ఇక అందాల రాక్ష‌సితో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసింది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ్యూటీ లావ‌ణ్య‌త్రిపాఠి. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో వ‌రుస ఆఫ‌ర్లతో బిజీ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.