కోయ భాషలో విజయ్ వర్మ చిత్రం

204

తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నిర్మాతగా, సమర్పకుడిగా, సహ నిర్మాతగా 17 చిత్రాలను అందించిన విజయ్‌వర్మ పాకలపాటి తన చిరకాల స్వప్నమైన కోయ భాషలో చిత్రం తీసేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేశారు. ఇటీవల విడుదలైన ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రానికి నిర్మాతలలో ఒకరైన విజయ్‌వర్మ పాకలపాటి తన పుట్టినరోజు (ఆగష్టు 25)ని పురష్కరించుకొని మాట్లాడుతూ – చిన్నప్పటినుండి గిరిజనులతో మమేకమై పెరిగిన తాను గిరిజనుల సంస్కృతి, సంప్రదాయం, సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో గిరిజనులలో అధికంగా వాడుకలో ఉన్న కోయభాషలో ఓ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో తీయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా సమాంతరంగా తీయనున్నామని అన్నారు. ప్రజా సినిమా బ్యానర్ పై పలు భాషలలో సందేశాత్మక చిత్రాలను అందివ్వాలనే దృఢసంకల్పంతో మొదటిగా కోయభాషలో చిత్రానికి శ్రీకారం చుట్టాటనని అన్నారు. కోయభాషపై, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న తాను ఈ చిత్రాన్ని వాస్తవికతకు అద్దం పట్టేలా తెరకెక్కిస్తానని అన్నారు.

002

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేందుకు, తెలుగు సినీ రంగంలో ఉండే వారందరూ నిత్యం ఓ కుటుంబంలా సత్సంబంధాలను కలిగి ఉండేందుకు ఓ వేదిక అవసరం అని భావించి తెలుగు సినిమా వేదిక పేరుతో ఓ సొసైటీ స్థాపనకు చొరవ తీసుకున్నట్లు తెలిపారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చలనచిత్రపరిశ్రమలో జరుగుతున్నప్పటికీ చిన్నస్థాయి నీ కార్మికులకు, సాంకేతిక నిపుణులకు, కళాకారులకు వీటిలో పాలు పంచుకునే భాగ్యం కలగటం లేదని, అలాగే పలువురు సరైన అవకాశాలు లేక మరో ఉపాధిపై అవగాహన లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని… ఇలా సామాన్య సినీ ప్రజానీకానికి ఉన్న సాంస్కృతిక, సామాజిక, శిక్షణ మరియు ఉపాధికై వారధిగా ఉండేలా తెలుగుసినిమా వేదికను తీర్చి దిద్దనున్నట్లు విజయ్‌వర్మ పాకలపాటి తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అందరినీ భాగస్వామ్యం చేసి ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

004