కీవిస్ టార్‌-టీమిండియా జట్టు ఇదే

595
- Advertisement -

సొంత‌గ‌డ్డ‌పై న‌్యూజిలాండ్‌తో  జ‌రిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఫామ్‌లో లేని రోహిత్‌శ‌ర్మ‌ను సెలక్టర్లు కనుకరించారు.సోమ‌వారం చీఫ్ సెల‌క్ట‌ర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ కమిటీ స‌మావేశ‌మైన టీమ్‌ను ఎంపిక చేసింది. ఈ స‌మావేశానికి కోచ్ కుంబ్లే, కెప్టెన్ విరాట్‌కోహ్లి కూడా హాజ‌ర‌య్యారు. అయితే పెద్ద‌గా సంచ‌ల‌న నిర్ణ‌యాలు లేకుండా వెస్టిండీస్‌లో ఆడిన టీమ్‌నే ఎంపిక చేసింది సెల‌క్ష‌న్ క‌మిటీ.

18టెస్టులాడిన రోహిత్‌ ఇప్పటి వరకు టెస్టుల్లో నిలకడలేమితో తుది జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. విండీస్‌ పర్యటనలో రెండు టెస్టులాడేందుకు అవకాశం రాగా మూడో టెస్టులో తక్కువ పరుగులకే రోహిత్‌ అవుటయ్యాడు. కెప్టెన్‌ కోహ్లి మద్దతుతో రోహిత్‌ తుది జట్టులో స్థానం సంపాదించాడు. యువ ఆటగాళ్ల నుంచి పుజారా, అమిత్‌ మిశ్రా పోటీ ఎదుర్కొని జట్టులో స్థానం పదిలం చేసుకున్నారు.

teamselection

ఫామ్‌లో ఉన్న‌ గౌత‌మ్ గంభీర్ మ‌ళ్లీ టీమ్‌లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావించినా.. సెల‌క్ట‌ర్లు అత‌న్ని క‌రుణించ‌లేదు. శార్దూల్, స్టువర్ట్ బిన్నీలను తొలగించింది. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు టెస్టులు, 5 వన్డేలు జరగనున్నాయి. ఈ నెల 22న కాన్పూర్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మొదటి టెస్టు ప్రారంభంకానుంది.

భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రాహుల్‌, పూజారా, రహానె, విజయ్‌, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, సహా, రవీంద్ర జడేజా, షమీ, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, అమిత్‌ మిశ్రా, ఉమేశ్‌ యాదవ్‌.

- Advertisement -