అనురాధా ఫిలింస్ డివిజన్ పతాకంపై జి.రవికుమార్ ( బాంబే రవి ) దర్శకుడిగా చదలవాడ తిరుపతి రావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం రోజ్ గార్డెన్ ఈ సినిమా లాంఛనంగా ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించిన అనంతరం యూనిట్ కాశ్మీర్ కు బయలు దేరి వెళ్ళింది.
ప్రస్తుతం కాశ్మీర్ లో ఉండే బయాకన పరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది.. కాశ్మీరీ నేపధ్యంగా సాగే ఈ ప్రేమ కథను కాశ్మీర్ లోచిత్రీకరిస్తే అందులో జీవం ఉట్టి పడుతుందని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ప్రస్తుతం కాశ్మీర్ లో ఉన్న ప్రతి కూల పరిస్థితులను పట్టించు కోకుండా జాతి సమగ్రతలో భాగంగా తనకు కాశ్మీర్ ప్రభుత్వంతో ఉన్న పూర్వ పరిచయంతో ఆ ప్రభుత్వాన్ని సంప్రదించడంతో అక్కడి ప్రభుత్వం సంతోషాన్ని వ్యక్తం చేసి షూటింగ్ చేసు కోవడానికి అన్ని రకాల అనుమతులతో పాటు భద్రతను కూడా కల్పిస్తామని .. ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నా శాంతి పరిస్థితులు ఏర్పడ్డం కోసం తమ సినిమా షూటింగ్ జరుపుకోవడానికి వచ్చిన చదలవాడ సోదరులను ఆ ప్రభుత్వం అభినందించింది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీరు కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకున్న సందర్భాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు..అనురాధా ఫిలింస్ గతంలో రూపిందించిన ఓ సినిమా ను కాశ్మీర్ లో చిత్రీకరించడం అప్పటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆ సినిమా మొదటి ఆటను చూడటానికి ప్రత్యేక మైన హెలికాప్టర్లో రావడం జరిగింది.
ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక భారతీయుడిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను.. కాశ్మీర్ లోఉన్న ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని కోరుకునే వ్యక్తిని నేను అందుకే యుద్ద వాతావరణం ఉన్నా కూడా నేను కూడా నా వంతు సహకారాన్ని అందించడం కోసం ఇక్కడ మా సినిమా షూటింగ్ చేస్తున్నాము. కాశ్మీర్ ప్రభుత్వం ఇలాంటి సమయంలో మేము వచ్చినందుకు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారువారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు జి.రవికుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ ఉగ్రవాద కలాపాల నేపధ్యంలో జరిగే ప్రేమ కథా చిత్రం ఇది.ఈ సినిమా ద్వారా నితిన్ నాష్ అనే యువకుడు కథా నాయకుడిగా నటిస్తున్నాడు .. ఇది ఫీల్ ఉన్న ఫ్రెష్ ప్రేమ కథా చిత్రం.. నేను ఈ సినిమాను కాశ్మీర్ నేపధ్యంలో జరిగే విధంగా రాసుకున్నాను. నిర్మాత నా కథను ఇష్టపడి నువ్వు ఎలా అనుకుంటే అలా చేయమని పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.. ఇక్కడ ప్రతి కూల పరిస్థితులు ఉన్నా కూడా భయపడకుండా కాశ్మీర్ లోనే షూటింగ్ చేయడానికి అన్ని సదుపాయాలను కల్పించారు.
ఈ సినిమాలో నితీనాశ్, ఫర్జాజ్ శెట్టి లు జంటగా నటిస్తుండగా మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళి , రజిత, ధన్ రాజ్ , గౌతం రాజ్. శివసత్యనారాయణ,, మహేష్ మంజ్రేకర్,త్యాగరాజన్, మిలింద్ గుణజీ,అన్ హాధ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణః చదలవాడ తిరుపతిరావు, నిర్మాతః చదలవాడ శ్రీనివాసరావు,ఎడిటిర్ః బల్లు సలూజ ( లగాన్.జోదా అక్బర్ ఫేం) పాటలుః ఎ.యం.రత్నం, స్ర్కీన్ ప్లే,, మాటలుః సంగీతంః దర్శకత్వంః జి.రవికుమార్ (బాంబేరవి).