కాపీ కొట్టిన అవసరాల..!

572
- Advertisement -

టాలీవుడ్‌లో సంగీత దర్శకులు తమ సినిమాల్లోని పాటలను ఇతర భాషల నుంచి కాపీ కొట్టడం మనకు తెలిసిందే. ఈ విషయంలో లెటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ పోటీ పడిమరి ఒకరిని మించి మరోకరు ముందున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కూడా అదే జరుగుతోంది. సినిమా పోస్టర్‌ దగ్గరి నుంచి మధ్య మధ్యలో సీన్లను హాలీవుడ్,బాలీవుడ్ నుంచి కాపీ కొట్టి తమ సొంత క్రెడిట్ అంటూ తెగ బిల్డప్ ఇస్తుంటారు.దర్శక ధీరుడు రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి దగ్గరి నుంచి అల్లు అర్జున్ సరైనోడు, రాంచరణ్ ధృవ ఫస్ట్ లుక్ వరకు కొన్ని సీన్లను ఇతర సినిమాల నుంచి కాపీ కొట్టినవే. ఎక్కడి నుంచి కాపీ కొట్టారో అన్న విషయాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా రాజమౌళి శిష్యుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఆ జాబితాలోనే చేరిపోయాడు.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన జో అచ్చుతానంద సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తరువాత నారా రోహిత్, నాగ శౌర్య హిట్ కొట్టారని అనుకుంటున్నారు అభిమానులు. ఊహలు గుస గుసలాడే సినిమా తరువాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమా ఇది, సినిమాలో డైలాగ్స్ జంద్యాల , రమణ గార్ల  స్ధాయిలో ఉన్నాయని ప్రసంసిస్తున్నారు.

Jo-Achyutananda

`ఒక ఆడ‌ది త‌న వంద కోరిక‌ల్ని ఒక్క మ‌గాడే తీర్చాల‌నుకొంటుంది. అదే మ‌గాడు త‌న‌కున్న ఒక్క కోరిక‌ని వంద మంది ఆడ‌వాళ్లు తీర్చాల‌నుకొంటాడు` అనే డైలాగు వాట్సాప్‌ల్లో, ఫేస్‌బుక్కుల్లో సినిమా విడుదలకు ముందే వైర‌ల్ అయ్యిందేన‌ట‌. కాని స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టుగా ఉంది క‌దా అని అవ‌స‌రాల వాడేశాడంటూ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.

- Advertisement -