కాకినాడ నుంచే ‘ప్రత్యేక’ పోరు

426

వర్తమాన రాజకీయాలు యువతకు ఏం చేయలేకపోతే బాధేస్తుందని జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. సినిమాలు వేరు నిజజీవితం వేరని అన్నారు. తిరుపతి ఇందిరామైదానంలో జనసేన బహిరంగసభలో మాట్లాడిన పవన్‌..నాకు పదవులపై వ్యామోహం లేదని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాలు యువతకు ఉపయోగపడాలని పవన్ అన్నారు.

మోడీతో కలిసి ఎన్నికల ప్రచారంలో తిరుపతి నుంచే పాల్గొన్నానని…అందుకే తిరుపతిని ఎంచుకున్నానని పవన్ తెలిపారు.ఏపీ ప్రజల కోసం పోరాటం చేస్తానని తెలిపారు.రాజకీయ లబ్ది కోసం ఎప్పుడు విమర్శలు చేయనని…పవన్ జనసేన పార్టీ పెట్టింది ప్రజల కోసమేనని వెల్లడించారు. మోడీ కోసమో….చంద్రబాబు కోసమో జనసేన పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. మాట ఇస్తే తప్పనని….యువత,ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని ఆకాంక్షించారు. మోడీకి భజన చేయనని…తెలుగు ప్రజల కోసం ఎన్ని విమర్శలు చేసిన భరిస్తానని తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని…..ఏపీని కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనసేన పోరాటం చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం మూడు దఫాలుగా పోరాటం చేస్తానని తెలిపారు. ప్రత్యేక హోదాపై ఇకనుంచి ప్రశ్నిస్తానని తెలిపారు. బీజేపీ రాష్ట్రాన్ని విడగొట్టాలని తీర్మానించిన కాకినాడ నుంచే పోరుబాట మొదలుపెడతానని తెలిపారు.కాంగ్రెస్‌,బీజేపీ చేసిన ద్రోహన్ని ప్రజలకు వివరిస్తానని తెలిపారు. బీజేపీతో కలిసి పనిచేసే  ప్రసక్తే లేదని పవన్ తెలిపారు.

పవన్ అభిమానులు…జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఉపయోగపడేవారని తెలిపారు. పవన్ కల్యాణ్‌కు కులం అంటించవద్దని… తన కూతురు క్రిస్టియన్‌ అని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రమాణస్వీకారం చేసే రోజు కలిశానని…ఇంతవరకు మళ్లీ కలవలేదని అన్నారు. తనను బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారని…కానీ నేను తిరస్కరించానని తెలిపారు. జనసేన ప్రాంతీయ పార్టీఐనా…జాతీయ సమగ్రత గల పార్టీ అని తెలిపారు.

వామపక్ష ఉద్యమాలంటే తనకు గౌరవముందని అన్నారు.సినిమాని వినోదంగా చూడాలనే…అనవసర ఘర్షణలకు దిగవద్దని తెలిపారు. తనకు ఇతర హీరోలతో గొడవలు లేవని తెలిపారు. తిరుపతిలో జనసేన సైనికుడు వినోద్ రాయల్ హత్యకు గురికావటం కలిచివేసిందని…అభిమానం పేరుతో జీవితాలను నాశనం చేసుకొవద్దన్నారు.ఏపీ రాజధాని అమరావతి విషయంలో రైతుల పక్షాన నిలబడ్డానని తెలిపారు.

జనసేన పార్టీ పెట్టింది తెలుగు ప్రజల జెండా మోయటానికేనని….ఎవరి లాభం కోసం కాదన్నారు.ఇప్పటివరకు సీమాంధ్రుల ప్రేమ చూశారని…ఇచ్చిన మాట తప్పితే సీమాంధ్రుల పౌరుశం చూస్తారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ అడ్డగొలుగా విభజించి…యువతకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.