కరోనా నిబంధనల మధ్య..5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్

42
rahul

దేశవ్యాప్తంగా అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుండగా ఇందుకోసం అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

ఐదు రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా పశ్చిమ బెంగాల్‌లో 1,113, కేరళలో 633, అస్సాంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాత్రి వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానుండగా నాగార్జునసాగర్ బైపోల్ విజేత ఎవరో కూడా తేలనుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

ప్రధానంగా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌ ఫలితాలపై ఉంది. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ కూడా హోరాహోరిగా పోరు సాగిందని వెల్లడించగా ఎవరు విజేతగా నిలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.