మీరు చేస్తున్న కృషికి చరిత్రలో నిలిచిపోతారు..

171
vemula
- Advertisement -

శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కరోనా కట్టడి, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా అధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, మేయర్ ఆకుల సుజాత, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సౌజన్యంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగులు, జర్నలిస్టులకు కలిపి దాదాపు 2000 మందికి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటయిజర్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ముందుగా మేల్కొనని దేశాలు చాలా నష్టపోతున్నాయి. ఇక సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలుతున్నాం. వ్యాధి సోకకుండా ఉండాలంటే ఇళ్లలోనే ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అందరూ క్రమ శిక్షణతో ఉండటం వల్లే కరోనాను కట్టడి చేయగలుగుతున్నామన్నారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు అందరూ ఇళ్లలోనే ఉండాలి. కరోనా కట్టడికి పోలీస్ లు, ఆశావర్కర్లు, రెవెన్యూ కింది స్థాయి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది బాధ్యతగా పనిచేయటం వల్లే కరోనాను కట్టడి చేయగలుతున్నామని మంత్రి అన్నారు.

రాష్ట్రంలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న మీరు చరిత్రలో నిలిచిపోతారు. జిల్లాలో 61 మందికి పాజిటివ్ వస్తే 30 మంది కొలుకున్నారు. ఇంకా 31 మంది త్వరలోనే కోలుకుని క్షేమంగా వస్తారు. ఇంకా కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటే వైరస్ ను పూర్తిగా తరిమికొట్టిన వారమవుతాయి. మే7 వరకు ఇదే చొరవ చూపెట్టాలి. కరోనా కట్టడికి మీడియా చేస్తున్న కృషి మరువలేనిదని మంత్రి కొనియాడారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులను సైతం కాదని కరోనాతో పోరాడుతూ సేవలందిస్తున్న మున్సిపల్, ఆశావర్కర్లు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు. యుద్ధంలో వీర సైనికులుగా పని చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -