కంటి ఆప‌రేషన్ చేయించుకోనున్న‌ భ‌ళ్లాల‌దేవుడు

183
rana

అటు విల‌న్, ఇటు హీరో పాత్ర‌ల్లో న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో రానా ద‌గ్గుబాటి. బాహుబ‌లి సినిమాలో న‌టించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబ‌లి సినిమాలో భ‌ల్లాలదేవుడిగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. హీరోగా చేస్తూ..వేరే సినిమాల్లో న‌టిస్తూ మంచి స‌క్సెస్ మీద ఉన్నాడు రాణా. త్వ‌ర‌లోనే రాణా కంటి ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. రాణాకి కుడి క‌న్ను క‌నిపించ‌ద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఒక షోలో పాల్గోన్న రాణా త‌న‌కు కుడి క‌న్ను ప‌నిచేయ‌ద‌ని చెప్పాడు.

suresh babu, rana

అలా అని త‌ను భాద ప‌డ‌టం లేద‌ని త‌న ప్ర‌య‌త్నం తాను చేస్తున్నాన‌ని తెలిపారు. భాదపడుతూ కూర్చుంటే మనం ముందుకు సాగ‌లేం అన్నారు. అప్ప‌టి నుంచి రాణాకు కుడి క‌న్ను ప‌నిచేయ‌ద‌నే విష‌యం అంద‌రికి తెలిసింది. తాజాగా రాణా తండ్రి ప్ర‌ముఖ ప్రోడ్యూస‌ర్ దగ్గుబాటి సురేష్ బాబు ఓ ఇంట‌ర్యూలో రాణా కంటి ఆప‌రేష‌న్ గురించి తెలిపాడు. రాణా ఆప‌రేష‌న్ కు గురించి స‌రైన డేట్ ను వెతుకుతున్నామ‌న్నారు.

rana daggubati

ఆప‌రేష‌న్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌న్నారు. కంటి ఆప‌రేష‌న్ ఇండియాలో జ‌ర‌గ‌ద‌ని..వేరే దేశంలో ఆప‌రేష‌న్ చేయించాల‌న్నారు. అందుకోస‌మే కొంచెం ఆల‌స్య‌మవుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం రాణా మూడు సినిమాల్లో న‌టిస్తుంన్నందున డేట్స్ స‌రిపోలేనందున ఆప‌రేష‌న్ ఆల‌స్యం అవుతుంద‌ని తెలిపారు.