కంటతడి పెట్టిన పవన్‌…

358

తిరుపతిలో మృతి చెందిన పవన్ అభిమాని వినోద్ రాయల్ కుటుంబసభ్యుల్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. జరిగిన దారుణాన్ని భాదతప్త హృదయంతో పవన్‌కు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు వినోద్ తల్లిదండ్రులు. కొద్ది రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన వినోద్ తిరిగిరాని లోకాలకు వెళ్లాడని కుటుంబ సభ్యులు పవన్‌కు వివరించారు. వినోద్ తల్లిదండ్రులను చూసి పవన్ కన్నీటి పర్యంతమయ్యారు. మంచి పనికి వెళ్లిన తన కొడుకు దారుణంగా పొట్టనపెట్టుకున్నారని వివరించారు. తమకు న్యాయం చేయాలని…అసలు నిందితులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ చేతికి రాఖి కట్టిన వినోద్‌ తల్లి…న్యాయం చేయాలని వేడుకుంది.

చివరిసారిగా తన కొడుకు మరణిస్తు జై పవన్‌ అంటు చనిపోయాడని వివరించింది. కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన అవయవదాన కార్యక్రమంలో వినోద్ రాయ్ పాల్గొన్నారు. తన ప్రసంగం చివర్లలో జై పవన్ అనడంతో గొడవ మొదలైంది. దీంతో మరో హీరో అభిమాని అక్షయ్‌‌…వినోద్‌తో వాగ్వాదానికి దిగాడు. గొడవ పెద్దది కావడంతో వినోద్‌ను మరో హీరో అభిమాని కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన వినోద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించాడు. పవన్‌ను చూసేందుకు స్ధానికులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

వీడియో కోసం క్లిక్ చేయండి: