ఓ వైపు వరదలు…బోటులో ప్రసవం

360

ఉత్తరప్రదేశ్ ను వర్షాలు, వరదలు కుదిపేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు గంగ, యమున సహా నదులన్నీ పొంగి ప్రవహిస్తుండటంతో వరదలు ముంచెత్తున్నాయి. చుట్టూ వరద నీరు. నిండు గర్భిణి ప్రసవ వేదన.ఆసుపత్రికెళ్లడం కాదు కదా. కాలు బయటపెట్టలేని స్థితి. ప్రకృతి పెట్టిన పరీక్ష అది. వైద్యం అంటుబాటులో లేకపోవడంతో దైవంపైనే భారం వేసింది. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి వరద నీరు గ్రామాలను ముంచెత్తిన యూపీలోలో చోటు చేసుకున్న హృదాయ విదారక సంఘటన ఇది. ఆస్పత్రిలో ప్రసవించాల్సిన ఆమె…బోటులో ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. బాండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

up

యూపీలోని ఘాగ్రాస్ నది గట్టుదాటి ప్రవహిస్తుండటంతో వరదనీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్)కు చెందిన 56 దళాలు ఆయా రాష్ర్టాల్లో నిరంతరాయంగా సహాయ చర్యలు చేపడుతున్నాయి. బీహార్, యూపీ కేంద్రంగా ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఇద్దరు ఐజీలు ఆ దళాలను పర్యవేక్షిస్తున్నారు.

People

People1