అమెరికన్ అధ్యక్ష ఎన్నికల పుణ్యమాని ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నట్టే కనిపిస్తోంది. అయితే ఓటర్లను ఆకర్షించడం కోసం ఇదేదో నేతలు చేస్తోన్న హంగామా కాదు. తమ అభిమాన నేతకు పట్టం కట్టేందుకు నేతల అభిమానులే రంగంలోకి దిగి వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
నిన్నటికి నిన్న.. “బిచ్చం వేస్తారా..! లేక ట్రంప్ కు ఓటేయమంటారా..?” లాంటి ప్రచారం అమెరికన్ సోషల్ మీడియాలో దర్శనమివ్వగా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి మద్దతు తెలుపుతోన్న ప్రముఖ పాప్ సింగర్ కాటీ పెర్రీ న్యూడ్ పబ్లిసిటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఎక్కువ మంది యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో.. ఫన్నీ ఆర్ డై అండ్ రాక్ ది ఓట్ పేరిట ఓ వీడియోను రూపొందించింది కెర్రీ.
ఇందులో విశేషం ఏమిటంటే.. అందరినీ ఎలా కావాలంటే అలా వచ్చి ఓటేయమని చెబుతూ తాను ఉన్నట్టుండి పూర్తి నగ్నంగా మారిపోతుంది. అదిచూసి అప్పుడే బూత్‌లో ఓటు వేయడానికి వెళ్తున్న ఓ వ్యక్తి కింద పడిపోతాడు. క్యూలో ఉన్నవాళ్లు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంతలో ఇద్దరు పోలీసులు వచ్చి పెర్రీని తీసుకెళ్లి పోలీసు కారులో కూర్చోబెట్టేస్తారు. దీన్నంతటినీ కలిపి ‘ఫన్నీ ఆర్ డై’ అనే పేరుతో ఒక వీడియో రూపొందించింది.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు వచ్చి ఓటు వేయాలని, తనకు మాత్రం నగ్నంగా ఓటు వేయడమే ఇష్టమని అంటోంది కేటీ. ప్రజాస్వామ్యంలో మన ఇష్టం వచ్చినట్లు పక్కమీద నుంచి లేచి అలాగే వచ్చి ఓటు వేయొచ్చని ,పోలింగ్ బూత్ లోకి నగ్నంగా ప్రవేశించకూడదని.. ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా అని ఎదురు ప్రశ్నిస్తోంది.
ఇలాంటి వీడియో మనదేశంలో రిలీజైతే.. పొలిటికల్, సోషల్ గా హీటెక్కేంది. అగ్రరాజ్యం అమెరికా కదా.. పెద్దగా ఎవ్వరు పట్టించుకోపోవచ్చు.