ఉద్యోగులకు కేసీఆర్ వరం..

241
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే.. వరాల ముఖ్యమంత్రిగా పేరొందిన కేసీఆర్ మరో వరం ఇచ్చేశారు. అన్ని వర్గాలకు వరాలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్న ఆయన.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనే పెద్ద మనసుతో నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఆకర్షణీయమైన జీతాలతో పాటు.. తాజాగా కరువు భత్యాన్ని పెంచుతు నిర్ణయం తీసుకున్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికీ ప్రభుత్వం శుభవార్తనందించింది.రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కరువుభత్యానికి(డీఏ) పెంచుతు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క‌రువు భ‌త్యాన్ని (డీఏ)ను 3.144శాతం పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంత‌కం చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంది. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏటా 1,100 కోట్ల అదనపు భారం పడనుంది. డీఏ పెంపు నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు 3.1444 శాతం డీఏ పెంపుపై టీఎన్జీవోస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంచినందుకు సీఎం కేసీఆర్కు టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -