ఉదయభానుకు కవలలా?…

631
Anchor Udaya Bhanu is pregnant?
Anchor Udaya Bhanu is pregnant?
- Advertisement -

ఇప్పుడు హాట్ హాట్ యాంకర్ అంటే అనసూయ, రష్మి, ప్రశాంతి అనే పేర్లు గుర్తు తెచ్చుకొంటున్నాము కానీ.. ఇటువంటి ట్రెండ్ ను బుల్లి తెరపై సెట్ చేసింది మాత్రం కచ్చితంగా యాంకర్ ఉదయ భాను… టీవీ షో వ్యాఖ్యాతగా… ఆడియో ఫంక్షంలో హోస్ట్ గా.. గల గల మాటలతో అన్ని వర్గాల వారిని అలరించింది. వెండి తెరపై కూడా కొన్ని పాత్రల్లో కనిపించింది..

యాంకర్ గా ఉదయభాను హై సక్సెస్. ఆమె ఎవరో తెలియని తెలుగు వాళ్ళు లేరేమో అన్నంతగా ఓ తరాన్ని ఏలింది. అయితే ఈ మధ్యన ఆమె జోరు పూర్తిగా తగ్గింది. ఎందుకో ఏమిటో తెలియకపోయినా ఆమె లేని లోటుని తెలుగు టీవి ఇండస్ట్రీ మాత్రం బాగా ఫీలవుతోంది. అయితే తాజాగా ఆమె గురించి ఓ వార్త మీడియాలోకు హఠాత్తుగా ప్రచారంలోకి వచ్చింది.

అదేమిటంటే….ఇంతకాలం తర్వాత ఉదయభాను తల్లి కాబోతోందంటూ వెబ్‌ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. పిల్లలు అంటే ఎంతో ఇష్టపడే ఆమె..

కానీ గత కొంత కాలంగా ఉదయ భాను ఎక్కడా కనిపించడం లేదు… దీనికి కారణం ఉదయ భాను ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడమేనట… మరో వారం పది రోజుల్లో ఉదయ భాను పండంటి కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నదట. అందుకనే ఏ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఉదయ భాను వెల్లడించింది. ఉదయ భాను.. బిజినెస్ మెన్ విజయ్ ని పెళ్లి చేసుకొని 10 ఏళ్ళకు పైగా అయ్యింది… లైఫ్ లో సెటిల్ అయ్యాక పిల్లలు అని ఇన్ని ఏళ్ళకు పిల్లల ప్లాన్ చేసుకొన్నారట.. కాగా నాకు కవల పిల్లలంటే చాలా ఇష్టం…. నేను దేవుడిని ఎప్పుడు కవల పిల్లలు ఇవ్వమని ప్రార్ధించే దానిని.. ఇప్పుడు ఆ కోరిక తీరబోతున్నది.. అని చెప్పడమే కాదు.. తనకు ఆడ, మగ అనే తేడాలేదని.. ఎవరైనా తనకు ఇష్టమే నని తెలిపింది..

పదేళ్లక్రితం విజయ్ తో పెళ్లైన ఉదయభాను ప్రస్తుతం తొమ్మిదినెలలో గర్భంతో ఉంది.  తన జీవితంలోకి మరో ఇద్దరు రాబోతున్నారని ఆమె ఎంతో సంతోషంతో ఉంది. పుట్టబోయేది ఆడ, మగ ఏవరైనా తనకు ఒక్కటే అంటోంది. మరీ పండంటి బిడ్డలకు జన్మనివ్వబోతున్న భానును మనమూ విష్ చేద్దాం.

- Advertisement -