ఇలియానాకు పెళ్లైంది….

444
Has Ileana Secretly Married?
Has Ileana Secretly Married?

పెళ్లైన ఆడవాళ్లను ‘శ్రీమతి’ అని, కానివాళ్లను ‘కుమారి’ అని సంబోధించడం, గౌరవించడం మన భారతీయ సంప్రదాయం. ఆ లెక్కన ఇలియానాకి పెళ్లి కాలేదు కనుక ‘కుమారి ఇలియానా’ అనడం సబబు. మరి, శ్రీమతి అంటున్నారేంటి అని ఆలోచిస్తున్నారా! ఈ గోవా బ్యూటీకి పెళ్లైందనేది తాజా వార్త. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా ప్రేమలో ఉన్నారనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆండ్రూతో తన ప్రేమాయణం బయటకు రాకుండా దాచేయాలని ఇలియానా ఎప్పుడూ ప్రయత్నించలేదు.

ఆ మ‌ధ్య వీరిద్ద‌రూ పెళ్ళి చేసుకోబోతున్నార‌నే వార్త‌లు గ‌ట్టిగా వినిపించినా కొన్ని రోజుల త‌ర్వాత ఆ వార్త మాయం అయ్యింది. అయితే  గతేడాది డిసెంబర్ లోనే ఆస్ట్రేలియాలో ఆండ్రూ, ఇలియానాల పెళ్లి జరిగిందట. పెళ్లికి హాజరైన అతిథులతో ఎక్కడా తమ పెళ్లి విషయం చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారట. చూడాలి ఈ వార్త‌ల మీద ఇలియానా నోరు విప్పి ఏం మాట్లాడుతుందో.

ఎలాగైనా కేరియర్ ని సక్సెస్ ట్రాక్ లో పెట్టుకోవడానికి నానా కష్టాలు పడుతున్న ఇలియానా, తను పెళ్ళి చేసుకున్న విషయం బయటికి వస్తే ఎఫెక్ట్ ఆఫర్స్ పై పడుతుందనుకుందేమో అందుకే ఈ విషయాన్ని బయటికి రాకుండా ఇన్నాళ్ళు మ్యానేజ్ చేసింది. ఎలాగైతేనేం ఇప్పుడు ఇలియానా సింగిల్ కాదన్న విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సీక్రెట్ పెళ్లిని మన గోవా బ్యూటీ అదే ఈ ఆస్ట్రేలియన్ బ్యూటీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.