రిలయన్స్ జియో 4జీ సేవలు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్‌లను ప్రకటించడంతో జియో సిమ్ కార్డుల కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారు. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. దీంతో రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ముందు జనం బారులు తీరి కన్పిస్తున్నారు.
ఇక సిమ్ తీసుకున్న వినియోగదారులు జియో సిమ్ యాక్టివేషన్ కోసం రియన్స్ స్టోర్ల చుట్టూ తిరుగుతున్నారు. సర్వర్ డౌన్.. మళ్లీ రండంటూ రిలయన్స్ సిబ్బంది నుండి సమాధానం వస్తుంది. అదేవిధంగా పాత సిమ్‌లు యాక్టివేట్ చేసేంత వరకు కొత్త సిమ్‌లు ఇవ్వడం లేదు రిలయన్స్ స్టోర్లు.
ఇది తమ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల అమలుకు విఘాతం కావచ్చని భావిస్తున్న రిలయన్స్.. సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. జియో సిమ్ పొందేందుకు వినియోగదారులు వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకుని వ్యక్తిగత సమాచారాన్ని, చిరునామా తదితర వివరాలను అందిస్తే, వారం రోజుల్లోనే సిమ్ లభిస్తుందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సిమ్ లను డోర్ డెలివరీ చేస్తామని, తద్వారా స్టోర్ల ముందు భారీ క్యూల్లో గంటల తరబడి పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు.