- Advertisement -
ఉత్తమ ప్రజాకీయ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు,సినీ నటుడు ఉపేంద్ర. 14 మందితో తలిజాబితాను విడుదల చేసిన ఉపేంద్ర ఆటో గుర్తుకు ఓటేయాలని ప్రజలకు సూచించారు.
ఈ సందర్భంగా ఖాకీ చొక్కాలు ధరించి వచ్చిన 14 మంది అభ్యర్థులను మీడియాకు పరిచయం చేశారు. రాజకీయ నాయకులు వేసుకునే ఖద్దర్, తెల్లచోక్కాలు తాను వేసుకోబోమని, కార్మికులుగా ప్రజలకు సేవ చెయ్యడానికి ఇష్టపడుతామన్నారు.ఈ చొక్కాలతోనే ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు.
పారదర్శకతే లక్ష్యంగా సామాన్యుల చేత పోటీ చేయిస్తున్నామన్న ఆయన.. కులాల గురించి మాట్లాడబోమని స్పష్టం చేశారు. తమకంటూ ప్రత్యేక మేనిఫెస్టో లేదని, ప్రజలు రూపొందించి ఇచ్చిన మేనిఫెస్టోనే అమలు చేస్తామని పేర్కొన్నారు.
- Advertisement -