- Advertisement -
సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కుతున్న సినిమా సంబరాల ఏటి గట్టు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రోహిత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీగా పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతుంది.
ఇవాళ సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు కావడంతో సంబరాల ఏటి గట్టు సినిమా నుంచి అసుర ఆగమనం అంటూ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఇదేదో కెజిఎఫ్ సెటప్ లా కనిపిస్తుంది. సాంకేతికంగా అయితే సినిమా అదిరిపోతుంది తెలుస్తుంది.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో సంబరాల ఏటి గట్టుని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read:BRS:మాగంటి సునీత నామినేషన్
- Advertisement -

