వెంకన్నకు కాళోజీ పురస్కారం

627
venkannaaa
venkannaaa
- Advertisement -

వాస్తవిక ప్రపంచాన్ని తన పాటల రూపంలో ప్రజల ముందుంచే ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్నకు కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును వెంకన్నకు ప్రభుత్వం అందజేయనుంది. ప్రజాకవి, పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా వెంకన్నను ప్రభుత్వం సన్మానించి పురస్కారాన్ని అందజేయనుంది. గతేడాది సుప్రసిద్ధ రచయిత అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం వరించింది.

venkanna

వెంకన్న పాటల్లో ఉండే అక్షరాలు సమాజాన్ని సూటిగా ప్రశ్నించే శరాలు.. పల్లె కన్నీరు పెడుతుందో అంటూ పల్లెల పరిస్థితిని కంటికి కట్టినా..? గల్లీ చిన్నదీ అంటూ తన జీర గొంతుతో పాట అందుకున్నాడంటే.. జనమంతా ఆయన పాటలో తన్మయత్వం పోందాల్సిందే. బందూక్ సినిమా కోసం గోరెటి వెంకన్న రాసిన పాటలో తెలంగాణ జిల్లాల గురించి గొప్పగా వర్ణించాడు.

https://youtu.be/VV1WsRvwQ-s

- Advertisement -