ప్రముఖ సినీ నటుడు,వైసీపీ నేత మోహన్ బాబుకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు తీర్పు వెలువరించింది.
సినీ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై చెక్ బౌన్స్ కేసు వేశారు.రూ. 40లక్షల చెక్ బౌన్స్‌కి సంబంధించి వైవీఎస్ 2010లో కోర్టుని ఆశ్రయించగా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నట్టు తెలుస్తుంది.
మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 41.75 లక్షల జరిమానాను విధించింది కోర్టు. కోర్టు విధించిన జరిమానాని మోహన్ బాబు చెల్లించని పక్షంలో మరో మూడు నెలల శిక్ష పొడిగించనున్నట్టు న్యాయవాది తెలిపారు.
సలీం అనే మూవీ చిత్రాన్ని తెరకెక్కించినందుకు గాను వైవీఎస్ చౌదరికి రూ.40.50లక్షల చెక్కును మోహన్ బాబు అందించారు. ఆ చెక్ బౌన్స్ కావడంతో వైవీఎస్ కోర్టుని ఆశ్రయించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తీర్పు వెలవడగా ఈ తీర్పుపై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందా వేచి చూడాలి.