మనసు మార్చుకున్న నిత్య…

652
- Advertisement -

ఎక్స్‌పోజింగ్‌ విషయంలో నిత్యమీనన్ మనసు మార్చుకున్నట్లుంది. ఇప్పుడు అందాల ఆరబోతకు నిత్యా సిద్ధంగా ఉన్నట్లు టాక్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఈభామ టాలీవుడ్ హీరోలపై హాట్ కామెంట్స్ చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.ఆ తరువాత ఎక్స్ పోజింగ్ పై కూడా మీడియాపై రుసరుసలాడిన సందర్బాలున్నాయి. అయితే ఇప్పుడు కొద్దిపాటి ఎక్స్‌పోజింగ్‌కు నిత్య ఓకే చెప్పేసిందట. అయితే కథ కూడా కాస్తో కూస్తో నిత్యకు నచ్చాలట.

అప్పుడే నిర్మాతలు చెప్పినట్లు చేస్తానంటోంది ఈ భామ. దీంతో ఇదే సరైన టైమని కొందరు నిర్మాతలు నిత్యా కాల్షీట్ల కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మూడు పదులకు దగ్గరగా ఉన్న నిత్యకు ఇకపై అవకాశాలు రావడం చాలా కష్టమే. అందుకే అమ్మడు నింబంధనలకు నీళ్లొదులుతున్నట్లు కనిపిస్తోంది. మరో పక్క కుర్ర హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్‌ తో పోటీ ఇస్తుండం కూడా నిత్యలోని మార్పుకు కారణం కావచ్చు.మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడింది నిత్య.

- Advertisement -