బెంగుళూరుపై ఘన విజయం సాధించిన సన్ రైజర్స్…

587
SRH vs RCB
- Advertisement -

ఉప్పల్ వేదికగా జరిగిన బెంగుళూరు వర్సెస్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. 118పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న బెంగుళూరుకు భారీ లక్ష్యాన్నిచ్చింది సన్ రైజర్స్. . నిర్ణిత 20ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231పరుగులు సాధించింది. అద్భుతమైన బ్యాటింగ్ తో బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ లు ఇద్దరూ సెంచరీలు చేశారు.

బెయిర్ స్టో 56బంతుల్లో 114పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ 55బంతుల్లో 100పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ 3బంతుల్లో 9పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన యూసుఫ్‌ పటాన్ 6బంతుల్లో 6పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆతర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు టీం కు ఆదిలోనే తొలి వికెట్ కొల్పోయింది.

ఓపెనర్ పృధ్వీ పటేల్ 11పరుగులకే అవుట్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన విరాట్ కోహ్లి కూడా 3పరుగులకే అవుట్ అయ్యాడు. ఆతర్వత వచ్చిన వాళ్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 19.5ఓవర్లలో బెంగుళూర్ టీం అల్ అవుట్ అయ్యింది. 118పరుగుల తేడాతో బెంగుళూరుపై విజయం సాధించి వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది హైదరబాద్.

- Advertisement -