పీవీ సింధుకు రాజీవ్ ఖేల్ రత్న

551
- Advertisement -

క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు నలుగురిని కేంద్రం ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్‌లో రజతం సాధించిన పీవీ సింధు, రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షిమాలిక్‌ను రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారం వరించింది. వీరితో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దీపా కర్మాకర్‌(జిమ్మాస్టిక్స్‌), జీతూరాయ్‌(షూటింగ్‌)లకు కూడా ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపిక చేశారు. అదేవిధంగా వివిధ క్రీడలకు సంబంధించి ఆరుగురు ద్రోణాచార్య పురస్కారం అందుకోనున్నారు.15 మందికి అర్జున అవార్డులను ప్రకటించింది.

ద్రోణాచార్యులు వీరే..

* విశ్వేశ్వర్‌ నంది(దీపా కర్మాకర్‌ కోచ్‌)
* నాగపురి రమేష్‌(అథ్లెటిక్స్‌)
* సాగర్‌ మాల్‌ ధ్యాయల్‌(బాక్సింగ్‌)
* రాజ్‌కుమార్‌ శర్మ(క్రికెట్‌)
* ప్రదీప్‌ కుమార్‌(స్విమ్మింగ్‌)
* మహావీర్‌సింగ్‌(రెజ్లింగ్‌)

ముగ్గురికి ధ్యాన్‌చంద్‌ అవార్డు-2015

* సత్తిగీత(అథ్లెటిక్స్‌)
* సిల్వానస్‌ ధంగ్‌ధంగ్‌(హాకీ)
* రాజేంద్ర ప్రహ్లాద్‌ షెల్కె(రోయింగ్‌)

అర్జున అవార్డు వీరికే!

* రజత్‌ చౌహాన్‌(ఆర్చరీ)
* లలితా బాబర్‌(అథ్లెటిక్స్‌)
* సౌరవ్‌ కొఠారి(బిలియర్డ్స్‌)
* శివథాపా(బాక్సింగ్‌0
* అజింక్యా రహానే(క్రికెట్‌)
* సుబ్రతాపాల్‌(ఫుట్‌బాల్‌)
* రాణి(హకీ)
* వీఆర్‌ రఘునాథ్‌(హాకీ)
* గురుప్రీత్‌సింగ్‌(షూటింగ్‌)
* అపూర్వి చందేలా(షూటింగ్‌)
* సౌమ్యజిత్‌ ఘోష్‌(టేబుల్‌ టెన్నిస్‌)
* వినేశ్‌(రెజ్లింగ్‌)
* అమిత్‌కుమార్‌(రెజ్లింగ్‌)
* సందీప్‌సింగ్‌ మాన్‌(పారా అథ్లెటిక్‌)
* వీరేంద్రసింగ్‌(రెజ్లింగ్‌-బధిర)

- Advertisement -