- Advertisement -
కాంగ్రెస్ నేత రాహుల్ చిక్కుల్లో పడ్డారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన రాహుల్ గాంధీ..అక్కడి ఓ పబ్‌లో ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైకల్‌గా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ పబ్‌లో రాహుల్ గాంధీ ఎంజాయ్ చేస్తుండగా ఈ వీడియోపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే రాహుల్..అక్కడ పబ్ కల్చర్‌కు అలవాటు పడ్డారంటూ బీజేపీ నేతలు విమర్శించారు. రాజకీయాల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుతుందని విమర్శలు చేస్తున్నారు. రాహుల్‌కి ఇంకా కుర్రతనం పోలేదంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. కాగా ఓ వివాహ వేడుక కోసం రాహుల్ గాంధీ ఖాట్మండుకి చేరుకున్నారు.
- Advertisement -