తెరపై సింగర్ సునీత జీవిత కథ

638
Telugu-Playback-Singer-Sunitha-First-Short-Film-Raagam
Telugu-Playback-Singer-Sunitha-First-Short-Film-Raagam
- Advertisement -

మల్టీ టాలెంటెడ్ యాక్ట్రేస్‌ సునీత రాగం అనే షార్ట్ ఫిలిం లో నటిస్తోంది.ఇందులో ఆమె పాత్ర జర్నలిస్టు పాత్ర పోషిస్తోంది. ప్లే బ్యాక్ సింగర్ గా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత ఆ మధ్య శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక చిత్రం ద్వారా వెండి తెరపై మెరిసింది. ఇక త్రివిక్రమ్ సినిమాలోను సునీత నటించనుందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. అందం, అభినయం ఉన్నా కూడా నటనపై పెద్ద ఆసక్తి చూపించని సునీత తాజాగా స్త్రీల సమస్యలపై పోరాటం చేయబోతున్న పాత్రలో నటించింది.

Hot-Singer-Sunitha-

ఆమె నిజజీవితంలో ఎదుర్కొన్న కొన్ని కష్టాల్ని సాధించిన విజయాల్ని ఇందులో చిత్రీకరించారు. సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలయ్యింది. ఇందులో ఆమె ఓ జర్నలిస్ట్ గా నటించిందని, చాలా సీన్స్ ఆమె జీవిత కథవే కావడంతో ఈజీగా నటించిందని చెబుతున్నారు. ఆమె పాటలను ఆమె చేతే పాడించారు. అయితే బయటికి మాత్రం ఆమె జీవిత కథ అని చెప్పకుండా మహిళల సమస్యలపై పోరాడే వనితగా ఆమెను చూపారు.

sunitha-ragam

singer_sunitha_

ప్రేమ వివాహం చేసుకున్న సునీత భర్త తో విభేదాలు వచ్చి ఇద్దరు పిల్లలతో విడిగా ఉంటున్నారు. ఆయనతో ఎదురైన అనుభవాలను ఆమె చాలా ఇంటర్వ్యూల్లో చెప్పి బాధపడ్డారు. రోలింగ్ రోల్ పతాకంపై శ్రీ చంటి ఈ సినిమా ను రూపొందించారు. బహుముఖ ప్రజ్ఞ ఉన్న సునీత త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే సినిమాలోనూ నటించనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

- Advertisement -