కోలేటి దామోదర్‌కు కేటీఆర్ బర్త్‌డే విషెస్‌‌..

208
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తన 58వ జన్మదినం సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి కే. తారకరామారావుని హైదరాబాద్ ప్రగతి భవన్‌లో కలిసి, శుభాకాంక్షలు అందుకున్నారు.

అనంతరం ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ రూపొందించిన “గ్రీన్ ఛాలెంజ్” స్ఫూర్తితో, తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్, (డిజిపి ఆఫీస్, హైదరాబాదు) ఆవరణలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి.మల్లారెడ్డి, ఐపిఎస్ మరియు చీఫ్ ఇంజనీర్ టి. విజయ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -