కంటైన్మెంట్ ప్రాంతాల్లో కల్లు గీయవద్దు: మంత్రి

246
Minister Srinivas Goud On Corona
- Advertisement -

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 40 లక్షల కుటుంబాలు గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తారు. కరోనా సందర్భంగా గౌడ సోదరులు వృత్తిని కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరం పాటిస్తూ కల్లు గీసుకోవడానికి అనుమతి ఇచ్చారు.కానీ కల్లు కాంపౌండ్‌లు తెరవద్దన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో కల్లు గీయవద్దు. తరతరాలుగా వచ్చిన ఈ వృత్తిని కాపాడుకుంటూ దాని నుండి కల్లు, నీరను ప్రజలకి అందిస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న వృత్తులను అదుకుంటున్నారు అండగా నిలుస్తున్నారు. కులవృత్తుల పునరుద్ధరణ జరుగుతుంది. లాక్ డౌన్ నేపథ్యంలో కల్లు అమ్మకాలు నిలిచిపోయాయి. అయితే చెట్టు పన్ను రద్దు చేసి గీత కార్మికులకు భరోసా ఇచ్చామని మంత్రి తెలిపారు.

Minister Srinivas Goud On Corona

హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు ఏర్పాటు చేసి ఈ గీత కార్మికులను అండగా నిలిచాం. హరితహారం ద్వారా 3 లక్షల ఈత, తాటి చెట్లు నాటినం.సిరిసిల్లలో ప్రత్యేకంగా ఖార్జురా చెట్లను నాటాం.కరోనా ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర గైడు లైన్స్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.గీత కార్మికులను అదుకునేల అన్ని చర్యలు తీసుకున్నాం. పోలీసులు గీత కార్మికులను ఇబ్బంది పెట్టకూడదు. గీత కార్మికులు అందరూ దైర్యంగా తమ వృత్తిని కపాడుకునేలా చర్యలు చేపట్టాం. గౌడ సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసాం.ఈ ప్రభుత్వం అన్ని రంగాల వారికి అండగా నిలిస్తుంది.నిరా పాలసీ తెచ్చాం త్వరలోనే నిరా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా అన్ని కులాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారు.కరోనా తర్వాత తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. గీత కార్మికులు గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కల్లును అమ్ముకోవాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ కోరారు.

- Advertisement -