జనతాగ్యారేజ్ సక్సెస్ మీట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటతడి పెట్టాడు. ఈ వెలుగు రావడానికి 13 ఏళ్లు పట్టిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. ఆయన ఇచ్చిన స్పీచ్ అందరినీ కదిలించింది. ఇటు అభిమానులకు, అటు పేరెంట్స్ కి జనతాగ్యారేజ్ ద్వారా అద్భుతమైన ఆనందాన్ని పంచానంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.
ఏడుపు అపుకుంటున్నాను. ఆనందంతో వచ్చే ఏడుపే. కాని ఆపుకుంటున్నాను” అంటూ ప్రసంగించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజైనప్పుడు.. రకరకాల రిపోర్టులు వచ్చినప్పుడు.. అసలు ఆ ఫీడ్ బ్యాక్ వింటుంటే.. మీలో ఈ ఆనందాన్ని చూడ్డానికి ఇన్నేళ్ళుపట్టిందా అంటూ నేనే ఆనందపడ్డాను. జనతా గ్యారేజ్ ద్వారా అమ్మానాన్నలకు – అభిమానులకు – అందరికీ అద్భుతమైన ఆనందాన్ని పంచాను” అంటూ చెప్పాడు ఎన్టీఆర్. ”విజయాలు దక్కుతున్నాయి. విజయాలు వస్తున్నాయి. కాని ఇలాంటి విజయం కోసం ఎన్నేళ్ళు ఆగానో మీ అందరికీ తెలుసు. అభిమానుల ముందు తలెత్తుకు తిరిగే విజయాన్ని అందించిన కొరటాల శివకు ఆజన్మాంతం ఋణ పడిపోయి ఉంటాను” అంటూ మరింత ఎమోషనల్ అయిపోయాడు.
ఇది జనతా విజయం అని చెబుతూ.. సినిమా పేరును జనతా గ్యారేజ్ అని పెట్టినందుకే ఇలా జరిగిందంటూ.. ఫ్యూచర్ లో ఇలాంటి సినిమాలే చేస్తాను అని సెలవిచ్చాడు. ”జనతా గ్యారేజ్ విజయం ఒక ఊపునిచ్చింది. ఒక ఆనందాన్ని ఇచ్చింది. బ్రతికినంత కాలం ఇలానే అలరిస్తాను. మీ ఆప్యాయం పొందుతాను” బ్రతికినంతకాలం మీప్రేమను, అనురాగాల మధ్య ఇలాగే గడపాలని కోరుకుంటున్నానని తెలిపాడు. యూనిట్‌తోపాటు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
జనతాగ్యారేజ్ టీమ్ సాధించిన సక్సెస్ కాదని అభిమానుల విజయంగానే వర్ణించాడు. ఇంకో జన్మంటూ వుంటే మీ ప్రేమ, ఆప్యాయతలు మళ్లీ పొందాలని కోరుకుంటానని అన్నాడు.